తప్పు దొర్లితే జరిమానా... విదేశీ బ్యాంకులకు చుక్కలు చూపిస్తున్న చైనా
- చైనాలో దశాబ్దాలుగా పనిచేస్తున్నా విదేశీ బ్యాంకుల పురోగతి అంతంతమాత్రమే!
- దేశం మొత్తం బ్యాంకింగ్ ఆస్తుల్లో వాటి వాటా కేవలం 5 శాతమే
- సంక్లిష్ట నిబంధనలు, భారీ పన్నులతో చైనా ప్రభుత్వం కట్టడి
- ఏటా దాదాపు వెయ్యి రిపోర్టులు సమర్పించాల్సిన క్లిష్ట పరిస్థితి
- ఆర్జించిన లాభాలను సైతం దేశానికి తరలించకుండా ఆంక్షలు
చైనాలో దశాబ్దాలుగా విదేశీ బ్యాంకులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ, అవి వృద్ధి సాధించడంలో ఘోరంగా విఫలమవుతున్నాయి. దేశంలోని మొత్తం బ్యాంకింగ్ ఆస్తులలో వాటి వాటా కేవలం 5 శాతానికే పరిమితమైందని యూకేకు చెందిన 'ఏషియన్ లైట్' పత్రికలో డాక్టర్ షాలినీ కుమార్ రాసిన కథనం వెల్లడించింది. విదేశీ ఆర్థిక సంస్థలకు ఇచ్చిన హామీలను చైనా ప్రభుత్వం నిలబెట్టుకోవడం లేదని ఈ కథనం స్పష్టం చేసింది.
2001లో చైనా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)లో చేరినప్పుడు, విదేశీ సంస్థలకు దశలవారీగా తమ మార్కెట్లో భాగస్వామ్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అయితే, ఆచరణలో అది జరగలేదు. విదేశీ బ్యాంకులను పనిచేయడానికి అనుమతించినప్పటికీ, వాటి ఎదుగుదలను కట్టడి చేసేందుకు చైనా ప్రభుత్వం అనేక సంక్లిష్టమైన నిబంధనలను అమలు చేస్తోంది. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా, నేషనల్ ఫైనాన్షియల్ రెగ్యులేటరీ అడ్మినిస్ట్రేషన్, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ అనే మూడు సంస్థల పర్యవేక్షణలో విదేశీ బ్యాంకులు పనిచేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఒకే అంశంపై పలు నియంత్రణ సంస్థలకు జవాబుదారీగా ఉండాల్సి వస్తోంది.
ఈ కథనం ప్రకారం, చైనాలోని విదేశీ బ్యాంకులు ప్రతి ఏటా దాదాపు వెయ్యి నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో రోజువారీ, వారం, పక్షం, నెల, అర్ధ సంవత్సర, వార్షిక నివేదికలు ఉంటాయి. వీటిని సమర్పించడంలో ఏమాత్రం ఆలస్యమైనా లేదా తప్పులు దొర్లినా భారీగా జరిమానాలు విధిస్తున్నారు. దీంతో బ్యాంకుల ఉద్యోగులు నిరంతరం ఒత్తిడితో పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇక ఆర్థికపరమైన ఆంక్షలు కూడా తీవ్రంగానే ఉన్నాయి. విదేశీ బ్యాంకులు తమ ఆదాయంపై చైనా ప్రభుత్వానికి సుమారు 18 శాతం పన్ను చెల్లించాలి. దీనికి అదనంగా, వడ్డీ ఆదాయంపై 6 శాతం వ్యాట్ (వీఏటీ) కూడా విధిస్తున్నారు. ఇది బ్యాంకు లాభాలను నేరుగా దెబ్బతీస్తోంది.
అన్నింటికంటే ముఖ్యమైన ఆంక్ష ఏమిటంటే, ఇక్కడ సంపాదించిన లాభాలను ఆయా బ్యాంకులు తమ సొంత దేశాలకు తరలించడానికి వీల్లేదు. ఆ లాభాలను తిరిగి చైనాలోనే పెట్టుబడిగా పెట్టాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. ఈ కఠిన నిబంధనల వలయంలో చిక్కుకుని విదేశీ బ్యాంకులు చైనా మార్కెట్లో విస్తరించలేక సతమతమవుతున్నాయి.